అమెరికాను వణిస్తున్న హరికెన్

Hurricane four storm lashes Florida coast

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని హరికెన్ వణికిస్తోంది. భీకరమైన గాలులతో కూడి భారీ వర్షం కురుస్తుండటంతో జన జీవనం పూర్తిగా స్థంభించిపోయింది. మైఖెల్ హరికెన్ కారణంగా ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లోరిడాలోని పన్వాండల్ ప్రాంతంలో ప్రవేశించింది హరికెన్, 230 కి.మీ వేగంతో భీకరమైన గాలులు వీస్తూ ఆయా ప్రాంతాలను అతలాకుతలం చేసింది. సముద్రంలో 20 అడుగుల మేర అలలు ఎగిసిపడుతూ ముందుకు దూసుకొస్తున్నాయి. తీవ్రమైన గాలుల కారణంగా ఇళ్ల పైకప్పులు, చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలమట్టమయ్యాయి. ఎక్కడ చూసినా మైఖెల్ బీభత్సమే కనిపిస్తోంది. ఈ హరికెన్ ప్రభావం ఫ్లోరిడా, అలబామా, జార్జీయాలో కూడా ఉంటుందని జాతీయ హరికెన్ కేంద్రం వెల్లడించింది. అయితే కేటగిరి 4 తుఫానుగా నమోదైన ఈ మైఖెల్ తుపాను ఫ్లోరిడాలోని ఫ్యాన్ హ్యాండిల్ ప్రాంతంలో తీరం దాటనుందని అధికారులు వెల్లడించారు.