నేను మా నాన్నను.. నందమూరి కుటుంబంలో అరుదైన ఘటన..

kalyan-ram-plays-role-of-nandamuri-harikrishna-in-ntr-biopi

ప్రఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరావు జీవిత చరిత్ర ఆధారంగా అయన బయోపిక్ తెరకెక్కుతోంది. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తిచేసుకుంది ఈ చిత్రం. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో అతిలోక సుందరి శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేశారు. ఆమె ఫస్ట్ లుక్‌ను నిన్న విడుదల చేయగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ లుక్ ఒకటి బయటికొచ్చింది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కోసం అయన తనయుడు హరికృష్ణను రథసారధిగా నియమించుకున్నారు. రోజులతరబడి తండ్రికోసం హరికృష్ణ కష్టపడ్డారు. ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రలో నటిస్తున్నారు అయన తనయుడు కళ్యాణ్ రామ్. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో అప్పుడు హరికృష్ణ ఎలా అయితే సఫారీ సూట్ ధరించి రథం నడిపేవారో అలాగే ఉన్నారు. గంటలవ్యవధిలో కళ్యాణ్ రామ్ షేర్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అప్పట్లో బాబాయ్ బాలకృష్ణ సరసన బాలగోపాలుడులో నటించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన తండ్రి పాత్రలో.. అయన తండ్రి పాత్ర చేస్తున్న బాబాయ్ తో నటిస్తున్నారు. బహుశా నందమూరి కుటుంబంలో ఇదొక అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు.