అక్టోబర్ 12న ‘మూడు పువ్వులు – ఆరు కాయలు’

october 12th release date moodu puvvulu arukayalu

ఈ మధ్య విడుదల అయి సూపర్ హిట్ అయిన యూత్ ఫుల్ కామెడీ లవ్ ఎంటర్టైన్మెంట్ హిట్ చిత్రాల జాబితాలోకి మరొక సినిమా చేరనుంది, అదే ‘మూడు పువ్వులు – ఆరు కాయలు’ అర్జున్ యాజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో ముఖ్య తారాగణంగా సీమా చౌదరి, రామ స్వామి, అజయ్ గోష్, పృథ్వి రాజ్, తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్, బాలాజీ, జబర్దస్త్ రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవా, అప్పారావు, మహేష్, జయవాని, వాతావరణం జయలక్ష్మి, ప్రోమోదిని తదిరులు నటించగా వబ్బిన వెంకట రావు నిర్మాతగా రామ స్వామి దర్శకత్వం వహించారు, అయితే ఈ సినిమాకు మ్యూజిక్ కృష్ణ సాయి, లిరిక్స్ చంద్రబోసు, భాస్కరభట్ల, సింగెర్స్; ఏస్.పి బాలు, సాయి చరణ్, రమ్య బెహరా, కెమెరా ; మోహన్ చంద్, ఆర్ట్ కెవి రమణ, ఫైట్స్ మార్షల్ రమణ, ఎడిటర్ ఉపేంద్రా, పి.ఆర్,ఓ పులగం చిన్నారాయణ. కాగా, ఫుల్ లేన్త్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మరియు రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకొని ఈ అక్టోబర్ 12 న భారీ విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్, మేకింగ్ వీడియోస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసినదే, అందువల్లనే ఈ సినిమా గ్యారెంటి హిట్ అనే హిట్ టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.