సిక్సర్ల పిడుగు రిషబ్‌ పంత్‌ వచ్చేశాడు

rishab-panth-came-westindees

యువ వికెట్‌ కీపర్ బ్యాట్స్‌మన్‌‌, సిక్సర్ల పిడుగు రిషబ్‌ పంత్‌ వన్డేల్లోకి వచ్చేశాడు. టెస్టుల్లో మెరుపులు మెరిపిస్తున్న అతడిని వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేలకు బీసీసీఐ సెలక్టర్లు జట్టును ప్రకటించారు. ముందే అనుకున్నట్టుగానే దినేశ్‌ కార్తీక్‌పై వేటు పడింది. ఆసియాకప్‌లో అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ను, సీనియర్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజాకు అవకాశమిచ్చారు. పాండ్య స్థానంలో జడ్డూకు చోటు దక్కింది. వన్డే సిరీస్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుంది.