హెచ్చరిక.. తిత్లీ తుఫాన్.. గంటకు 120 నుంచి 140 కి.మీ వేగంతో..

cyclone, ap ,ts, phethai

తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను వణికిస్తోంది. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులతో టెక్కలి ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిత్లీ తుఫాన్ తీరం దాటాక వర్ష ఉధృతి మరింత పెరిగింది. తీరప్రాంతంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదులుగాలులు వీస్తున్నాయి. 4నుంచి 6 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళంతోపాటు విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ హైఎలర్ట్‌లోనూ ప్రకటించారు

* ఒడిశాలోనూ తుత్లీ ప్రభావంతో భారీవర్షాలు
* తుఫాన్ కారణంగా ఖుర్దారోడ్-విజయనగరం మధ్య.. రైళ్ల రాకపోకలు నిలిపేసిన తూర్పు కోస్తా రైల్వే
*దువ్వాడ, భద్రక్, విజయనగరం, ఖుర్దా స్టేషన్లలో నిలిచిన రైళ్లు
* శ్రీకాకుళం జిల్లాకు ఇంత విపత్తు రావడం బాధాకరం..- ఎంపీ రామ్మోహన్ నాయుడు
* ప్రాణనష్టం జరక్కుండా చర్యలు తీసుకున్నాం- ఎంపీ రామ్మోహన్ నాయుడు
* తుఫాన్ ప్రభావంపై 3జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
* పలాస మున్సిపాలిటీలో భారీవర్షానికి నీటమునిగిన కాలనీలు సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్న శ్రీకాకుళం కలెక్టర్ ధనుంజయరెడ్డి
* శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా
* శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌లు
* సహాయ చర్యల కోసం 1100కి ఫోన్ చేయాలని సూచన
* తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం.. పల్లెసారధి సమీపంలో తీరం దాటిన తిత్లీ తుఫాన్
* తీరం దాటిన తర్వాత 60 కి.మీ పరిధిలో భారీవర్షాలు
* గంటకు 120- 140 కి.మీ వేగంతో వణికించిన ఈదులుగాలులు