ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీఆర్ఎస్ అభ్యర్థి..

election code refuse trs candidate thati venkateswarlu

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా నేతలు ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి తాటి వెంకటేశ్వర్లు కోడ్ నిబంధనలకు విరుద్ధంగా చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని బూత్‌ లెవెల్ మీటింగ్‌లో ఈ చెక్కులు పంపిణీ చేయడమే కాకుండా..అది కవరేజ్ చేసిన మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. అనంతరం అభివృద్ధి పనులపై గ్రామస్తులు తాటి వెంకటేశ్వర్లను నిలదీస్తుండగా కవరేజ్ చేస్తున్న మీడియాపై మరోసారి రుసరుసలాడారు.