టాలీవుడ్ లో శ్రీరెడ్డి.. కోలివుడ్‌లో చిన్మయి.. హోటల్‌ గదికి రమ్మని..

పెద్ద మనుషుల ముసుగులో సాగించిన అకృత్యాలు మీటూ ఉద్యమంతో ఒక్కొక్కటీగా వెలుగులోకి వస్తుడటంతో సినీ ఇండ్రస్టీ షేక్ అవుతుంది. గతంలో కక్కుర్తిపడి చిలిపి పనులు చేసిన సెలబ్రెటీలకు చెమటలు పడుతున్నాయి. ఎవరీ నోటు నుంచి తమ పేరును వినాల్సి వస్తుందోమోనని బయంతో గజగజావణుకుతున్నారు.

ఇటీవల శ్రీశక్తి అంటూ శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌కౌచ్ వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహార అప్పట్లో పెను దుమారం రేపింది. తాజాగా మీటూ ఉద్యమం అంటూ గాయనీ చిన్నయి చేసిన ఆరోపణలు కోలివుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

తమిళనాడుకు చెందిన ప్రముఖ రచయిత వైరముత్తు రామసామి తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్నారు చిన్మయి. ఆయనతో ఎదురైన భయానక అనుభవాలను మీటూ అంటూ సోషల్ మీడియా వేదిక ద్వార బయటపెట్టింది చిన్మయి. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఎదురైన సంఘటనను ఆమె బయట పెట్టారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న వైరముత్తు షో అయిన తరువాత తనను హోటల్‌ గదికి రమ్మని పిలిచారని.. అందుకు తను నిరాకరించిందని చిన్మయి తెలిపారు. ఆ సమయంలో వైరముత్తు మరో ఇద్దరు అమ్మాయిలను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైరముత్తు అధికార బలంతో వారంతా బయటకు చెప్పడానికి భయపడుతున్నారు. అయితే ఇది సరైన సమయం. వేటగాడి చేతుల్లో చిక్కి బాధపడుతున్న బాధిత మహిళలందరూ ఇప్పటికైనా మౌనాన్ని వీడాలని పిలుపునిచ్చారు చిన్మయి. తనలా వేధింపులకు గురైన వారు ఇప్పటికైనా బహిరంగంగా ఆ విషయాలను బయట పెట్టాలని కోరారు.

ఇది ఇలా ఉంటే చిన్మయి ఆరోపణలకు తాజాగా స్పందించారు వైరముత్తు. పేరున్న తనలాంటి వారిపై అలాంటి ఆరోపణలు చేయడం ఇప్పుడు ఫ్యాషనైపోయిందని, నిజాల్ని కాలమే బయటపెడుతుందని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు వైరముత్తు.

అయితే ఎన్నో విజయవంతమైన సినిమాలకు పాటలు రాసి, జాతీయ పురస్కారాలు అందుకున్న వైరముత్తును పద్మ విభూషన్‌ వరించింది. అలాంటి వ్యక్తి యువతిని లైంగికంగా వేధించారనే ఆరోపణలు రావటంతో సినీ ఇండ్రస్టీలో సంచలనంగా మారింది. మరీ ఈ మీటు ఉద్యమం ఇంకా ఎంత మందిని బయటకు తెస్తుందో చూడాలి.