రూ.1000 కోట్ల బడ్జెట్‌తో మహాభారతం.. కోర్టును ఆశ్రయించనున్న రచయిత..

మ‌హాభార‌తం గాథను మూవీగా తీసేందుకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాల మంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో రాజమౌళి, బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్ వెండితెరపై మహాభారత గాథను తెరకెక్కించేందుకు సన్నాహాలు కూడా  చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే మహాభారతం మూవీని తీస్తున్నట్లు అధికారంగా ప్రకటించింది మాత్రం దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త బీఆర్‌ శెట్టి. ఈ మూవీలో భీముడిగా పాత్రలో మళయాళం నటుడు మోహన్ లాల్ నటించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది కూడా.

ఈ మూవీలో భీముడి పాత్ర ప్రధానంగా చూపించేలా కథను తయారు చేసుకున్నారు. ఇందుకోసం ప్రముఖ రచయిత ఎమ్‌టీ వాసుదేవన్‌ నాయర్‌ రచించిన రంధమూలం నవల హక్కుల్ని మూవీ యూనిట్ తీసుకుంది. వ్యాపార వేత్త బీఆర్‌ శెట్టి రూ.1000 కోట్ల బడ్జెట్‌తో శ్రీకుమార్‌ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేశారు. మూడేళ్ల‌లో మూవీని పూర్తి చేస్తామ‌ని ర‌చయిత‌తో నిర్మాణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు కావాల్సిన స్క్రీన్‌ప్లేను కూడా వాసుదేవన్‌ సమకూర్చారు.

అయితే నాలుగేళ్లు గడుస్తున్న ఇంత వరకు మూవీ సెట్స్ పైకి వెళ్లకపోవటంతో రచయిత అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందానికి అనుగుణంగా ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న స్కిప్ట్ మూవీగా తెర‌కెక్క‌క‌పోవ‌డం పై దర్శక నిర్మాతలపై ఫైర్‌ అయ్యారు వాసు దేవన్. త‌న స్క్రిప్ట్ త‌న‌కు ఇచ్చేయాల‌ంటూ దర్శక నిర్మాతలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు రచయిత. ఈ విషయంపై రచయిత వాసు దేవన్ త్వరలో కోర్టును ఆశ్రయించనున్నట్లు మాలీవుడ్‌ టాక్.