బ్రేకింగ్ : ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న ఇంటర్నెట్ సేవలు..??

global-internet-shutdown-likely-next-48-hrs

రానున్న 48 గంటల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నట్టు ‘రష్యా టుడే’ పత్రిక ప్రచురించింది. రొటీన్‌ మెయింటినెన్స్‌లో భాగంగా ప్రధాన సర్వర్‌, దానికి సంబంధించిన కనెక్షన్లను నిలిపివేస్తారని.. ఫలితంగా ఇంటర్నెట్‌ సేవలకు కొద్దిసేపు అంతరాయం కలుగుతుందని ‘రష్యా టుడే’ పేర్కొంది. ప్రధాన సర్వర్ ను ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌ నిర్వహిస్తోందని. ఇది క్రిప్టోగ్రాఫిక్‌ కీని మారుస్తున్నారని.. దీనివల్ల ఇంటర్నెట్‌ అడ్రస్‌ బుక్‌ మార్క్ మరియు డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ (DNS) భద్రంగా ఉంటుందని.. కొంతకాలంగా జరుగుతున్న సైబర్ దాడుల నేపథ్యంలో ప్రధాన సర్వర్‌ కు ఎటువంటి ఆటంకం కలగకుండా.. ఎదుర్కొనేందుకు ఈ ప్రక్రియ అవసరమని ‘రష్యా టుడే’ వెల్లడించింది. అయితే, ఈ వార్తల్లో పూర్తిగా వాస్తవం లేదంటున్నారు నిపుణులు.