వైసీపీకి పెట్టని కోటగా ఉన్నచోట గట్టి పోటీ..

special story on tdp leader reddeppagari srinivasareddy

రాజకీయ కుటుంబ నేపథ్యమే అయినా.. వారసత్వాన్ని నమ్ముకోలేదు. తండ్రి దివంగత రాజగోపాల్‌ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. సోదరుడు రమేష్‌ రెడ్డి ఎమ్మెల్యే. అయినా వారి రాజకీయాలకు భిన్నంగా శ్రీనివాసులు రెడ్డి సొంతంగా ఎదగడానికి ప్రయత్నించారు. వారి నీడ కూడా పడకుండా.. స్వతంత్రంగా పనిచేశారు. జనాలకు దగ్గరయ్యారు. వారసత్వం కేవలం ఎంట్రీకే కానీ.. రాజకీయంగా నిలబడటానికి కాదని బలంగా నమ్మే నాయకుడు శ్రీనివాసులురెడ్డి. అదే విషయాన్ని చేతల్లో కూడా నిరూపించారు.

2014కి ముందు రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉండే శ్రీనివాసుల రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో కొండనే ఢీకొట్టారు.. కడప లోక్‌ సభ అభ్యర్ధిగా వైఎస్‌ కుటంబంపై పోటీ చేశారు. వైఎస్‌ కుటుంబానికి, వైఎస్‌ఆర్‌ పార్టీకి పెట్టని కోటగా ఉన్న కడపలో అవినాష్‌ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. 2011లో జరిగిన కడప ఉపఎన్నికల్లో జగన్ ప్రభంజనంతో రాష్ట్రంలో సీనియర్ నేతలైన మైసూరారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డిలకు డిపాజిట్ గల్లంతు అయింది. 5లక్షల 45 వేల 672ఓట్ల భారీ మెజారిటీ జగన్ సొంతం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్, టీడీపీలు రాజకీయంగా డీలా పడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో తిరిగి మూడు సంవత్సరాల అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీలో నిలిచిన శ్రీనివాసులరెడ్డి గట్టిపోటీనిచ్చారు. మెజారిటీ 4 లక్షలు తగ్గించి.. టీడీపీ కేడర్‌ లో నూతనోత్సాహం నింపారు. ఓటమి చెందినా రాజకీయంగా ఎక్కడా వెనకడుగువేయలేదు. YCPని తట్టుకుని పార్టీ కార్యక్రమాలను చేపట్టారు. శ్రీనివాసులరెడ్డి రాజకీయ ప్రతిభను, వ్యూహ చతురతను గుర్తించిన చంద్రబాబునాయకుడు అనతికాలంలోనే టీడీపీ జిల్లా రధసారథిగా బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుండి జిల్లా అధికార పార్టీలో శ్రీనివాసులరెడ్డి మాటే వేదంగా మారింది.

2017 మార్చిలో జరిగిన స్థానిక సంస్థలకోటా ఎన్నికల్లో జగన్ చిన్నాన్న వివేకాను ఓడించి .. టీడీపీ తరపున బీటెక్ రవిని గెలిపించడంలో శ్రీనివాసుల రెడ్డిది కీలక పాత్ర. ఈ విక్టరీతో అధినేతకు మరింత చేరువయ్యారు. పార్టీని బలోపేతం చేయడం ఎంత బాధ్యతగా తీసుకున్నారో.. అధికార పార్టీ నాయకుడిగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చేయడంలో అంతే ముందున్నారు. అధినేతతో ఉన్న సాన్నిహిత్యం, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలతో ఆయనకున్న సత్సంబంధాలతో నియోజకవర్గానికి నిధుల వరద పారించారు.

కడప జిల్లాలో దశాబ్దాలుగా సాగునీటి సమస్య ఉంది. ముందు కరువు పారద్రోలాలన్న ఆశయంతో ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. సొంతపార్టీ నేతలను కలుపుకుపోయి.. అధినేత వద్ద పట్టుబట్టి ప్రాజెక్టులకు నిధులు రాబట్టారు. ఈ ఏడాది అవుకు నుండి 10 వేల క్యూసెక్కుల నీటిని గండికోటకు తరలించటంలోనూ శ్రీనివాసులరెడ్డి కృషి దాగి ఉంది. నేతలు, అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాలోని బ్రహ్మంసాగర్, సర్వారాయ సాగర్ ప్రాజెక్టులకు జలంతో జీవకళను తీసుకొచ్చారు. తాగునీటి కొరత లేకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. కడప జిల్లాలో నీరు చెట్టు పనులకింద చెరువులను కుంటలను ఆధునికీకరించి కరువు గడ్డపై భూగర్బజలాలను పెంచేందుకు 600 కోట్ల మేర నిదుల వరదను పారించారు.

నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్న శ్రీనివాసుల రెడ్డి పరిష్కారం కోసం నిత్యం శ్రమిస్తున్నారు. పదవులతో పనిలేదని.. అధినేత చంద్రబాబు ఇచ్చిన ధైర్యంతోనే ముందుకెళతానంటున్నారు.