ఏపీకి పెట్టుబడులు రాకుండా చేసేందుకు బిజెపి, వైసిపి, జ‌న‌సేన‌లు కలిసి కుట్ర : టీడీపీ

tdp

కొంత కాలంగా టిడిపి నేత‌లే టార్గెట్ గా జరుగుతున్న ఐటీ దాడులతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ నేతలు, పార్టీ మద్దతుదారులే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తుండటంతో టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. ఇటీవలే నెల్లూరు జిల్లా టీడీపీ నేత బీదా మస్తాన్ రావు, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుల తో పాటు సుజనా చౌదరి తాజాగా సీఎం రమేష్ పై జ‌రుగుతున్న‌ ఐటీ దాడులు రాజకీయ కుట్రలో భాగమేనని మండిపడుతున్నారు. కేంద్రం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ తరహా దాడులు చేస్తోందనే భావన టిడిపి నేత‌లు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

ఈ వరుస దాడులు ఏవో సంస్థలపై కాకుండా.. రాష్ట్రంపైనే జరుగుతున్న దాడిగా భావించాలని నేతలు అంటున్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని గట్టి ప్రతివాదననే నేతలు చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీసే క్రమంలో పెట్టుబడులు రాకుండా చేసేందుకు బిజెపి వైసిపి జ‌న‌సేన‌లు కలిసి పన్నిన కుట్రని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ కోణంలో కాకుండా నిజంగా అక్రమాస్తులపైనే ఐటీ దాడులైతే అవి తొలుత అమీత్ షా, కన్నా లక్ష్మీనారాయణల మీద జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర చేస్తున్న కుట్రలపై త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకోవాలని అధినేత చంద్రబాబు యోచిస్తున్నారు.ముందుగా టిడిపి నేత‌లే ల‌క్ష్యంగా జ‌రుగుతున్న ఐటి దాడుల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ళాల‌ని టిడిపి భావిస్తుంది. కేంద్రం తీరు.. దర్యాప్తు సంస్థలను రాష్ట్రం పైకి ఉసిగొల్పడం చూస్తుంటే.. దీని వెనుక కచ్చితంగా రాజకీయ కుట్ర ఉందనేది పార్టీ హై క‌మాండ్ ఆలోచ‌న‌. అంతే కాకుండా.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా.. పారిశ్రామివేత్తలను.. పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా భారీ స్థాయిలో ఐటీ దాడులు నిర్వహించడం చూస్తుంటే మ‌హ కుట్ర జ‌రుగుతుంద‌ని….వీటి అన్నింటిని స‌మ‌ర్ద‌వంతంగా తిప్పికోట్టాల‌ని టిడిపి భావిస్తుంది.ఒక యాక్ష‌న్ ప్లాన్ తీసుకుని ఐటి దాడుల‌పై ఫైట్ చేయాల‌ని టిడిపి భావిస్తుంది.అవ‌స‌ర‌మ‌యితే న్యాయ‌స్దానాల‌ను కూడా ఆశ్ర‌యించాల‌నే యోచ‌న‌లో టిడిపి ఉన్న‌ట్లు తెలుస్తుంది.

బిజెపితో పాటు మిగిలిన ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకుని మ‌రింత దూకుడుగా వెళ్ళాల‌ని టిడిపి భావిస్తుంది.థ‌ర్మ‌పోరాట స‌భ‌లు ఒక వైపు నిర్వ‌హిస్తూనే ఐటి దాడుల‌పై ఇష్యూని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ళాల‌ని టిడిపి భావిస్తుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.