అభ్యర్ధుల ఎంపికపై ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

tpcc-chief-uttham-kumarreddy-intresting-comments-on-congress-candidates

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని కీలక నేతలు తమ వారసులకు టిక్కెట్ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్న నేపత్యంలో ఉత్తమ్ వ్యాఖ్యలకు ఇంపార్టెన్స్ నెలకొంది. కుటుంబం నుంచి ఒక్కొరికే పార్టీ టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇదే అంశం కేంద్రం పరిశీలనలో ఉందని ఉత్తమ్ తెలిపారు. త్వరలోనే అభ్యర్ధులను కూడా ప్రకటిస్తామన్నారు. అలాగే పార్టీ చేరికలపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లోని ముఖ్య నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని బాంబ్ పేల్చారు. వారంతా కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. దీంతో ఎవరా నాయకులు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి వినోద్ టీఆర్‌ఎస్‌ నుంచి చెన్నూర్ టిక్కెట్ ఆశించి భంగపడ్డాడు. అలాగే నాయిని అల్లుడికి పార్టీ టిక్కెట్ దక్కలేదు. వీళ్లతో పాటు పదవీ కాలం అయిపోతున్న పలువురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌ గూటికి చేరే ప్రయత్నాలు జరుగనున్నాయానే గుసగుసలు వినబడుతున్నాయి. తాజాగా ఉత్తమ్ వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి మరింత బలం చేకురుతుంది. మహాకూటమి పొత్తులపై కూడా ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. మిత్రపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని..ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని మీడియా చిట్‌ చాట్‌లో పేర్కొన్నారు.