ఆర్మీ పాఠశాలలో టీచర్ పోస్టులు.. 57 ఏళ్ల వయసు వారూ దరఖాస్తు..

ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసిన వారికి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచర్ పోస్టులు భర్తీకి ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ పోస్టుల భర్తీకి 3 దశల్లో ఎంపిక జరుగుతుంది. మొదటి దశలో కంబైన్ట్ సెలక్షన్ స్ర్ర్కీనింగ్ పరీక్ష జరుగుతుంది. దీనిలో సెలక్ట్ అయిన వారు మాత్రమే తరువాతి రెండు దశలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. తాజాగా మొదటి దశ ఎంపికకు ప్రకటన వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల ఎంపికకు ప్రకటన వెలువడినప్పుడు ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి.
స్క్రీనింగ్‌కు అర్హత:
పీజీటీ: పీజీ, బీఎడ్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
టీజీటీ: గ్రాడ్యుయేషన్, బీఎడ్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
పీఆర్టీ: గ్రాడ్యుయేషన్, బీఎడ్ లేదా రెండేళ్ల డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత (టీజీటీ, పీజీటీ పోస్టులకు ఎంపిక కావడానికి సీటెట్ లేదా టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అయితే ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష రాసుకోవడానికి సీటెట్ లేదా టెట్ అవసరం లేదు)
వయసు: ఏప్రిల్ 1, 2019 నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి. బోధనలో అయిదేళ్ల అనుభవం ఉంటే 57 లోపు వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్‌లైన్ స్క్రీనింగ్, రెండో దశలో ముఖాముఖి, మూడో దశలో టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు: అక్టోబరు 24 సాయింత్రం 5 వరకు స్వీకరిస్తారు
స్క్రీనింగ్ పరీక్ష: నవంబరు 17, 18న నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, సికింద్రాబాద్.
వెబ్‌సైట్: http://apsncsb.in