రోజూ ఉదయం ఓ గ్లాస్ దానిమ్మ జ్యూస్.. స్త్రీ, పురుషులిద్దరికీ..

పండ్లన్నింటిలోకి అత్యుత్తమైన పండు దానిమ్మ పండు. అన్ని సీజన్‌లలో దొరికే పండు కూడా దానిమ్మ. ప్రకృతి ప్రసాదించిన శక్తివంతమైన ఈ పండులో శరీరానికి ఉత్తేజంతో పాటు ఆరోగ్యాన్ని కలిగించే గుణాలు ఉంటాయి. పలు పోషక పదార్థాలు ఉన్న ఈ దానిమ్మ పండు జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే కలిగే లాభాల గురించి..

* ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. రోజూ ఉదయం పూట తాగితే శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
* ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తీసుకుంటే శరీరంలో ఉండే బాక్టీరియా, వైరస్‌లపై శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేసి వాటిని నిర్మూలిస్తుంది.

* సహజసిద్దమైన ఆస్పిరిన్‌లా పనిచేస్తుంది. దీనివలన రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి.
* గుండె జబ్బులు ఉన్నవారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
* మలబద్దకం, అజీర్ణ సమస్యలను నివారిస్తుంది.
* దానిమ్మ పండు జ్యూస్‌ను వరుసగా 40 రోజుల పాటు తాగితే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలు తొలగుతాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది.