నయన్ లవ్‌కి బ్రేకులు పడటానికి కారణం ఆ జ్యోతిష్యుడేనా..!

వెండి తెరపై లేడీ సూపర్‌స్టార్‌గా తన హవా కొనసాగిస్తున్న అందాల తార నయనతార. వెండి తెరపై సునామీలా దూసుకెళ్తున్ననయన్.. ఆమె వ్యక్తిగత జీవితంలో లవ్ ఎపిసోడ్ మాత్రం సముద్రంలోని కెరటంలా ఎగిరెగిరి పడుతోంది.

నయన్ ఇప్పటికి ముగ్గురితో సాగించిన ప్రేమాయణం అంతులేని కథగా సాగిపోతుంది. కొన్నాళ్ల కిందట శింబుతో సాగించిన ప్రేమ నయన్‌ను డిప్రెషన్‌కి గురిచేసింది. అయితే శింబుతో నయన్ విడిపోయిన దగ్గర నుంచి వారపై అనేక వందతులు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వీళ్ల ప్రేమాయణం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు దర్శకుడు జీ.టీ.నందు.

చాలా కాలం క్రిందట దర్శకుడు నందుతో పాటు శింబుకు క్లోజ్‌గా ఉండే ఓ వ్యక్తి కలిసి ట్రిప్లికేన్‌ వెళ్లారట. అక్కడ పిళ్లైయార్‌ కోవిల్‌ వీధిలో ఉండే ఒక జ్యోతిష్యుడిని వీరు కలిసి శింబు, నయనతార జాతకాలను చూపించారట. వారి జాతకాలు చూసిన ఆ జ్యోతిష్యుడు నయనతారకు పెళ్లైతే ఆమె నడిరోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని, పెళ్లి చేసుకోకపోతే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పారట. అయితే వీళ్ల బ్రేకప్‌కి ఇది కూడ ఓ కారణం అయిండవచ్చు అంటూ నందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదిఇలా ఉంటే కెట్టవన్‌ అనే మూవీ విషయంలో శింబుకి దర్శకుడు నందుకు అభిప్రాయబేధాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నందు ఇలా శింబు, నయన్ గురించి చెప్పటం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నయనతారా రోడ్డున పడుతుందని శింబు బ్రేకప్ చెప్పాడా.. లేదా.. ముఖ్యమంత్రి అవ్వాలనే కాంక్షతో నయనతారనే శింబుని వదిలేసిందా.. ప్రశ్న ఒక్కటి.. సమాధానాలు అనేకం.. ఇలాంటి అనేక చిత్ర విచిత్ర ప్రశ్నలు చిత్ర పరిశ్రమల్లో చక్కర్లు కొడుతున్నాయి.