మీ టూ ఉద్యమంపై స్పందించిన పుల్లెల గోపీచంద్

pullela gopichandh responds on mee too

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న మీ టూ ఉద్యమంపై సెలెట్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తమ మద్దతును తెలియజేస్తున్నారు. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. మీటూ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే, క్రీడారంగంలోనూ ఇలాంటి వేధింపులు ఉండే అవకాశం లేకపోలేదని గోపీచంద్ అన్నారు. మహిళలకు బహిరంగంగా మాట్లాడుకునే స్వేచ్ఛనివ్వాలన్నారు.