టీసీఎస్‌ క్యాంపస్ రిక్రూట్‌మెంట్.. 28 వేల మందికి అవకాశం..

క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా 28000 మందిని ఎంపిక చేస్తామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించింది. గత రెండేళ్లలో తాము 20 వేల మందికి క్యాంస్ ప్లేస్‌మెంట్స్ ద్వాకా ఉద్యోగాలిచ్చామని చెప్పింది. ఈ విద్యాసంవత్సరానికి గాను ఇప్పటికే 16 వేల మందిని ఎంపిక చేసామని టీసీఎస్ గ్లోబల్ హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ తెలిపారు. మరికొంత మందిని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నామన్నారు. సెప్టెంబరు త్రైమాసికంలో అత్యధికంగా 10,227 మందిని ఎంపిక చేశామని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన 12 త్రైమాసికాల్లో ఇదే అతి పెద్ద రిక్రూట్‌మెంట్ అని సంస్థ తెలిపింది.