కొబ్బరికాయ కొట్టి లొకేషన్‌ దిష్టి తీసిన బాలీవుడ్‌ బ్యూటీ

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగిన కూడా భారతీయ సంప్రదాయాలను మాత్రం మరవలేదు. ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రం షూటింగ్ లొకేషన్‌కి కొబ్బరికాయ కొట్టి దిష్టి తీశారు. ‘దిసోనాలి బోస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫర్హాన్‌ అక్తర్, ప్రియాంకా చోప్రా, జైరా వసీమ్‌ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం తాజా షూటింగ్ షెడ్యూల్‌ లండన్‌లో జరుగుతోంది. అక్కడ షూటింగ్ ప్రారంభించే ముందు ప్రియాంక కొబ్బరికాయ కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇటీవల ప్రియాంక, నిక్‌ జానస్‌ల నిశ్చితార్థంజరిగిన విషయం తెలిసిందే. త్వరలో రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.