కువైట్‌లో కడప జిల్లా వాసి ఆత్మహత్య

కువైట్‌లో నివసిస్తున్న కడప జిల్లా వాసి ఓ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సుండుపల్లె మండలం గుట్టకింద రాచపల్లి గ్రామానికి చెందిన 44 ఏళ్ల గండికోట ఆనంద్‌ కువైట్‌లో మహాబుల్లా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఉదయం మూడు గంటల ప్రాంతంలో తాను నివసిస్తున్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మానసిక సమస్యల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తండ్రి ఆత్మహత్య విషయం తెలుసుకున్న కూతురు.. ఆవేదనో రాసిన లేఖ ఇప్పుడు అందర్నీ కంట తడి పెట్టిస్తోంది..