‘మీ టూ’ వ్యవహారంలో అమితాబ్.. సప్నా భవాని సంచలన వ్యాఖ్యలు..

‘మీ టూ’ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనాలకు తెరలేపింది. బాలీవుడ్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇండస్ట్రీలోని పెద్దలుగా చెప్పుకుంటున్న ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ వివాదానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరు కూడా వినిపిస్తోంది. మహిళలపై ఇలాంటి చర్యలు
తగవు. ఎవరైనా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కుంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలి అంటూ అమితాబ్ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ సప్నా భవాని స్పందిస్తూ త్వరలో మీ గురించిన నిజాలు కూడా బయటికి వస్తాయంటూ బాంబు పేల్చింది.

సప్నా తన ట్విట్టర్ అకౌంట్‌లో అమితాబ్ గురించి రాస్తూ.. సర్ మీ పింక్ సినిమాలానే మీ ఇమేజ్ కూడా త్వరలో పోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అది చూసి మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది అంటూ పోస్ట్ పెట్టింది. సప్నా అమితాబ్‌ని గురించిన ఎలాంటి సంచలన విషయాలు బయటపెడుతుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.