ఏపీపై బీజేపీ ప్రత్యేక దృష్టి..మంగళగిరిలో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన

ఏపీపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. రాష్ట్రం నుంచి అన్ని కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో కార్యాలయ శంకుస్థాపనకు శ్రీకారం చుట్టింది.. ఇవాళ మంగళగిరిలో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.

మరోవపు గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోని వీఆర్‌ గార్డెన్స్‌ ఎదురుగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. దీనికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. మంగళగిరిలో శంకుస్థాపన చేయనున్న పార్టీ రాష్ట్ర కార్యాలయానికి భారీ బహిరంగ సభ వేదిక నుంచే రిమోట్‌ ద్వారా శిలాఫలకాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవిష్కరిస్తారని బీజేపీ అధ్యక్షుడు కన్నా తెలిపారు..

రాష్ట్ర కార్యాలయ భూమిపూజ ఏర్పాట్లాలో బిజీగా ఉన్న కన్నా.. టీడీపీ నేతల విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థల పనికి అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్న సీఎం చంద్రబాబును పదవి నుంచి గవర్నర్‌ తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ నాయకులపై ఐటీ దాడులు జరగకూడదా అని నిలదీశారు… రాజకీయాలను అడ్డం పెట్టుకుని పన్నులు ఎగ్గొట్ట వచ్చని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అని కన్నాప్రశ్నించారు.