నేత్ర పర్వంగా తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి. సప్తగిరీషుడు నిత్యం వివిధ వాహనాల్లో ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. వెంకన్న వైభవాన్ని కనులారా చూసి తరించేందుకు లక్షల మంది భక్తులు కొండపైకి తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు..

నిన్న ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి సమయంలో గజవాహనంపై శ్రీవారు ఊరేగారు. తిరుమాడ వీధుల్లో మలయప్పను దర్శించుకుని.. భక్తకోటి కర్పూర నీరాజనాలు సమర్పించారు..

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన ప్రభవాహన సేవలకు ఇవాళ స్వామి సిద్ధమయ్యారు. ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై ఊరేగనున్నారు.. అలాగే సాయంత్రం చంద్ర ప్రభ వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు..