ఇలా చేయమని ఆయనే ప్రేరేపించాడు.. తనుశ్రీ సంచలన వ్యాఖ్యలు

మీటూ ప్రకంపనలు ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇలా చేయమని తనను దేవుడే ప్రేరేపించినట్లు చెబుతోంది తనుశ్రీ. చాలా మంది మహిళలు సిగ్గుపడి తమ పట్ల జరిగిన అన్యాయాన్ని తమలో దాచుకున్నారంది. తన పట్ల నానా పటేకర్‌ ప్రవర్తించిన తీరు విరక్తి పుట్టేలా ఉందన్న ఆమె.. ఆ ఘటన పరిశ్రమపై నమ్మకాన్ని కోల్పోయేలా చేసిందన్నారు.

tanushree-dutta-says-she-s-appalled-at-farah-khan-cynical-about-priyanka-chopra-s-intentions

2008లో ఓ సినిమా షూటింగ్‌ సమయంలో తనపట్ల నానా పటేకర్‌ అసభ్యకరంగా ప్రవర్తించారని తనుశ్రీ దత్తా చెబుతోంది. షూటింగ్‌లో డ్యాన్స్‌ మాస్టార్‌ గణేష్‌ ఆచార్యపై ఒత్తిడి తీసుకొచ్చి… తనతో ఇంటిమసిగా ఉండే సీన్లు పెట్టించారని తనుశ్రీ దత్తా ప్రధాన ఆరోపణ. ఇదే విషయమై కేసు నమోదు చేశారు. ఇందులో నానా పటేకర్‌ తో పాటు.. గణేష్‌ ఆచార్యను కూడా నిందితులుగా FIRలో పేర్కొన్నారు. దీనిపై గతంలో ప్రస్తావించిన ఎవరూ పట్టించుకోలేదని… ఈ సారి మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు తనుశ్రీ.