ఈ ప్రత్యేకమైన పూజ అంటే దుర్గమ్మకు చాలా ఇష్టం

dasara navaratri 2018 updates

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కనగదుర్గమ్మ దసరా నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాలు ఎనిమిదవ రోజైన ఇవాళ.. అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి నిజరూప దర్శనం కోసం వేకువజామున 3 గంటల నుంచే దర్శనానికి భక్తులను అనుమతించారు. దీంతో కొండపై క్యూ లైన్లన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. జై దుర్గా.. జైజై దుర్గా అనే నినాదాలతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ మారుమోగుతున్నాయి..


దుర్గాదేవిని పూజించడంతో దుర్గతులు పోయి.. సద్గతులు ప్రసాదిస్తాయని భక్తుల నమ్మకం. దుర్గాదేవి రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారికి ఇవాళ కుంకుమ పూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.