క్రికెటర్ శ్రీశాంత్ నాతో స‌హ‌జీవ‌నం చేశాడు: ప‌వ‌న్ హీరోయిన్‌

pawan-kalyan-heroine-reveals-shocking-things-about-former-indian-cricketer-sreesanth

దేశవ్యాప్తంగా ‘మీ టూ’ ప్రకంపనలు రేగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సినిమా సెలబ్రిటీలు ఇలా అందరిపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా ‘కొమరం పులి’ హీరోయిన్ నికిషా పటేల్ కూడా ముందుకొచ్చింది. క్రికెటర్ శ్రీశాంత్ తనతో సహజీవనం చేశాడని ఆమె అంటోంది. తెలుగులో చేసిన ఒక్కగానొక్క సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆమె ఇతర భాషల్లో నటించింది. ఆ స‌మ‌యంలోనే క్రికెట‌ర్ శ్రీశాంత్‌తో ఆమె ప్రేమ‌లో ప‌డింది.

వీరి ప్రేమాయ‌ణం గురించి అప్ప‌ట్లో హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. కొన్ని రోజుల కిందట శ్రీశాంత్ భువ‌నేశ్వ‌రి అనే యువ‌తిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీశాంత్ త‌న పెళ్లి గురించి మాట్లాడుతూ.. భువ‌నేశ్వరి, తాను ఏడేళ్లు ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నామ‌ని చెప్పాడు. అయితే ఈ విషయం అతని మాజీ ప్రియురాలు నికిషాకు నచ్చలేదు. ‘వేరే అమ్మాయిని ఏడేళ్ల‌పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నాన‌ని శ్రీశాంత్ చెప్పాడు. మ‌రి, నాతో ఏడాదిపాటు స‌హ‌జీవ‌నం చేయ‌డం గురించి ఏమి చెబుతాడు? శ్రీశాంత్‌తో బ్రేక‌ప్ త‌ర్వాత నేను చాలా ప్ర‌శాంతంగా ఉన్నా. అత‌ని నుంచి విడిపోయినందుకు నాకు కొంచెం కూడా బాధ లేదు. అత‌ను చెబుతున్న అబ‌ద్ధాల‌ను స‌హించ‌లేక‌పోతున్నానని నికీషా వెల్ల‌డించింది.