తెరుచుకున్న అయ్యప్ప ఆలయ ద్వారాలు.. రణరంగాన్ని తలపిస్తున్న..

Sabarimala-temple-Supreme-Court-verdict-kerala-women

స్వామియే శరణం నినాదాలతో వినిపించాల్సిన శబరి క్షేత్రం సేవ్ శబరి నినాదాలతో మార్మోగుతోంది. అయ్యప్ప భక్తులతో సందడిగా కనిపించాల్సిన ఆలయ మార్గాలు ఆందోళనలు, పోలీసులతో రణరంగంగా మారాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును అమలు చేస్తారా? ఆందోళనకు జడిసి వెనక్కి తగ్గుతారా అనే ఉత్కంఠ నెలకొంది. అయ్యప్ప ఆలయంలో ఏ అపచారం జరిగినా..ఆ
ఆలయాన్ని శుద్ధి చేసేందుకు పుణ్యాహవచనం జరపడం తప్పనిసరి. నలభై రోజుల పాటు చేపట్టాల్సిన దీక్షలో మైలాచారం పాటించకుండా మహిళలను అనుమతించటంపైనే భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్కంఠ మధ్యే అయప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలొచ్చారు.

సమానత్వం. స్త్రీ, పురుషులు అంతా ఒక్కటే. కరెక్టె. అయితే..ఆలయ ఆచారాల్లో ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్కో గుడికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కొన్ని గుళ్లలోకి పురుషులకు అనుమతి ఉండదు. మరిన్ని ఆలయాల్లోకి చొక్కాలతో అనుమతించరు. స్నానం చేసి పవిత్రంగా గుడికి వెళ్లటం హిందూ ఆచారంలో అత్యంత ప్రధానమైనది. కారణం మైలాచారం. ఇది అన్ని హిందూ గుళ్లలోనూ ఆచరించే ఆచరామే. అయితే..అయ్యప్ప భక్తులు నలభై రోజుల దీక్ష చేయాల్సి ఉంటుంది కాబట్టి మహిళల వయస్సుపై ఆంక్షలు ఉన్నాయనేది భక్తుల వాదన.

అయితే..కేరళా ప్రభుత్వం మాత్రం ఏది ఏమైనా సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసి తీరుతామని అంటోంది. అయ్యప్ప వెళ్లే ఆలయ మార్గాల్లో భారీగా బలగాలను మోహరించారు. ట్రావెన్ కోర్ దేవసం బోర్డు ప్రెసిడెంట్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు..ప్రస్తుతం నీలక్కల్‌ ప్రాంతంలో ఆందోళనకారులను ఆరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో ఆక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

అంతకుముందు శబరిమల ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలను ఆందోళనకారులు బలవంతంగా వెనక్కి పంపించారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లిన మహిళల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తురాలు మాధవి కూడా ఉన్నారు. పోలీసుల సహాయంతో మాధవి కొద్ది దూరం పాటు ప్రయాణించింది. తర్వాత ఆమెను బస్సులో పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. బస్సునే తగలబెడతామని ఆందోళనకారులు బెదిరింపులకు దిగటంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లిన టీవీ జర్నలిస్ట్ ను కూడా అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు.

ఆజన్మ బ్రహ్మచారిగా చెప్పుకునే అయ్యప్ప దర్శనానికి అన్న వయస్సుల మహిళలను అనుమతించాలని సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేసి తీరుతామని అంటోంది కేరళా ప్రభుత్వం. రాజ్యంగం ప్రకారం అంతా సమానమేనని అంటోంది. రాజకీయ కారణాలతోనే మహిళా భక్తుల్ని ఆందోళనలు అడ్డుకుంటున్నారని కేరళా మంత్రి శైలజా ఆరోపిస్తున్నారు.

శబరి ఆలయంలో బీజేపీ ద్వంద నీతి పాటిస్తోందన్నది కేరళ ప్రభుత్వం వాదన. సుప్రీం కోర్టులో అభ్యంతరాలు తెలుపకుండా.. శబరిలో మాత్రం ఆందోళనలకు ఉసిగొల్పుతోందని ప్రభుత్వం బీజేపీ తీరును తప్పుబడుతోంది. సుప్రీం ఎలాగైన అమలు చేసి తీరుతామంటున్న ప్రభుత్వం.. ఆయప్ప స్వామి ఆలయ మార్గాల్లో మరిన్ని బలగాలను మోహరించింది. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అదుపు చేయాలని ఆదేశించింది. సాధారణంగా ప్రతినెలా ఐదు రోజుల పాటు స్వామివారి దర్శనం ఉంటుంది. కానీ, సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయం తెరుచుకోవడం ఇదే తొలిసారి కావడం ఉత్కంఠను రేపుతోంది. భక్తులు ఉత్కంఠ ఎదురుచూస్తున్న అయప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. మహిళా భక్తులను భారీ బందోబస్తు మధ్య తీసుకెళ్తున్నారు పోలీసులు.