హలోగురూ ప్రేమకోసమే రివ్యూ.. ఎంగేజింగ్ ఎంటర్టైనర్ గురూ ..

రివ్యూ : హలోగురూ ప్రేమకోసమే
తారాగణం : రామ్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, ఆమని, సత్య, ప్రవీణ్, సితార, జయప్రకాష్, పోసాని తదితరులు
ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి చక్రవర్తి
నిర్మాత : శిరీష్ లక్ష్మణ్
దర్శకత్వం : త్రినాథరావు నక్కిన
రిలీజ్ డేట్ : 18.10.18

రామ్.. ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బట్ కొన్నాళ్లుగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్.. అందగత్తె, టాలెంట్ ఉంది. అయినా అమ్మడికి ఇంత వరకూ ఒక్క భారీ హిట్టూ లేదు. నిర్మాత దిల్ రాజుకు ఈ మధ్య అన్నీ షాకులే. అయినా ఈ ముగ్గురూ కలిసి సినిమా చేయడానికి రెడీ అయ్యారంటే కారణం.. కంటెంట్ పై ఉన్న నమ్మకం. ఆ కంటెంట్ ఇచ్చిన దర్శకుడు బ్యాక్ టు బ్యాక్ ఇచ్చిన హిట్స్. మొత్తంగా ఫస్ట్ లుక్ నుంచే ఆకట్టుకోవడం మొదలుపెట్టిన హలోగురూ ప్రేమకోసమే మూవీ ఇవాళ విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..

కథ :
కాకినాడలో ఆవారాగా తిరిగే సంజూ (రామ్). పేరెంట్స్ కోరికపై హైదరాబాద్ లో ఉద్యోగం చేయడానికి బయలుదేరతాడు. సంజూ తల్లి(సితార)కి హైదరాబాద్ లో విశ్వనాథ్(ప్రకాష్ రాజ్) అనే ఫ్రెండ్ ఉంటాడు. ఎవరికైనా మాట ఇస్తే తప్పని మనిషిగా విశ్వనాథ్ కు మంచి పేరుంటుంది. సంజూను అతని ఇంట్లో ఉండమని చెబుతుంది అతని మదర్. అక్కడ ఉండటానికే డిసైడ్ అయి వెళుతుంటాడు సంజూ. రైల్వే స్టేషన్ లో ఓ అమ్మాయి కాకినా అబ్బాయిల్ని కమెంట్ చేసిందని.. ఆ అమ్మాయిని ట్రెయిన్లో ఏడిపిస్తాడు. తన పేరు అనుపమ(అనుపమ పరమేశ్వరన్). సంజూ హైదరాబాద్ లో విశ్వనాథ్ ఇంటికి వెళతాడు. ఆశ్చర్యంగా విశ్వనాథ్ కూతురే సంజూ ఏడిపించిన అమ్మాయి అనుపమ. అవేవీ పట్టించుకోకుండా సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అవుతాడు సంజూ. అక్కడ రీతూ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. తనూ సంజూను లవ్ చేస్తుంది. ఓ రోజు రీతూ.. సంజూకు లవ్ ప్రపోజ్ చేస్తుంది. తను మాత్రం సడెన్ గా నేను అనూను ప్రేమిస్తున్నా అని చెబుతాడు. వెంటనే తన లవ్ ను ఎక్స్ ప్రెస్ చేయాలనుకుంటాడు. కానీ అప్పటికే అనుకు ఓ సంబంధం చూసి ఉంటాడు విశ్వనాథ్. పైగా సంజూనే తోడుగా తీసుకువెళ్లి ఆ సంబంధం ఖాయం చేసుకుంటాడు. మరి అనూకు తన ప్రేమ ఎలా చెప్పాడు. విశ్వనాథ్ కు తన ప్రేమ గురించి తెలిసిన తర్వాత వచ్చిన పరిణామాలేంటీ.. అసలు అనూ.. సంజూను లవ్ చేస్తుందా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ :
ఓ సాధారణ కథకు మంచి కథనం తోడైతే మంచి సినిమా అవుతుంది. కథనంలోనూ బలమైన సన్నివేశాలు లేనప్పుడు మంచి కామెడీని క్రియేట్ చేయడం ఓ పని. దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన పని ఇదే. కథగా ఈ ప్లాట్ పాతదే. దాన్నే కొత్త కామెడీతో సెట్ చేశాడు. దీంతో ఆటోమేటిక్ గా ఇది ఇంట్రెస్టింగ్ ప్లాట్ గా మారింది. పైగా ఆర్టిస్టులంతా టాలెంటెడ్ కావడంతో కొన్ని వీక్ సీన్స్ కూడా వాళ్లు పీక్ కు తీసుకువెళ్లారు. దీంతో హలోగురూ ప్రేమకోసమే.. చూడబుల్ గా మారింది. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంగ్లీష్ రాని అబ్బాయిలు ఎంత ఇబ్బంది పడతారనే సీన్ అదిరిపోయింది. లెంగ్తీగా ఉన్నా ఆసాంతం నవ్వించాడు మాటల రచయిత. అలాగే రీతుతో లవ్ ట్రాక్ కూడా ఫన్నీగా వర్కవుట్ కావడమే కాదు.. డబ్బుల్లేకపోతే లవర్ ను మెయిన్టేన్ చేయడం ఎంత ఇబ్బందో కూడా ఫన్నీగా చూపించడంతో ఫస్ట్ హాఫ్ అంతా ఎలాంటి కుదుపులు లేకుండా సాగిపోతుంది. ఇక తను ప్రేమించిన అనూకు వేరే సంబంధం సెట్ కావడం.. ఆ సంబంధానికి తనూ విశ్వనాథ్ తో వెళ్లాల్సి రావడం అంతా సెకండ్ హాఫ్ కు లీడ్ గా మారుతుంది. సెకండ్ హాఫ్ ప్రారంభం కావడం కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. తన కూతురుకు ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తానని చెప్పే విశ్వనాథ్ కూతురుకు మంచి సంబధం చూసిన ఆనందంలో సంజూతో కలిసి మందు కొడతాడు. ఆ టైమ్ లో తను అనూను ప్రేమిస్తున్నట్టు చెబుతాడు సంజూ. ఇక ఆ తర్వాత ఒక ఒప్పందంగా ఇద్దరూ ‘‘ఫ్రెండ్స్’’ అవుతారు. కానీ అనూహ్యంగా అక్కడి నుంచి కథనం సడెన్ గా డల్ అవుతుంది. కానీ ప్రకాష్ రాజ్, రామ్ ల మధ్య వచ్చే కొన్ని సీన్స్ రిపీటెడ్ గా అనిపించినా.. ఈ ఇద్దరూ దాన్ని ఈజీగా కవర్ చేసి బోర్ లేకుండా చూశారు. ఈ టైమ్ లో హీరోయిన్ క్యారెక్టర్ కూడా కాస్త డల్ అవుతుంది. మొత్తంగా కొన్ని భారమైన సీన్స్ తర్వాత మళ్లీ క్లైమాక్స్ కు 20నిమిషాల ముందు నుంచి దర్శకుడు ట్రాక్ లో పడతాడు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్, రామ్ ల మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి. మొత్తంగా అటు అనూ కూడా సంజూను ప్రేమిస్తుంది. ప్రేమించడమే కాదు.. తనను ఎక్కడికైనా తీసుకువెళ్లి పెళ్లి చేసుకోమంటుంది. అయినా మాట ఇస్తే తప్పడం తెలీని వీక్ నెస్ ఉన్న విశ్వనాథ్ తో కొంత కాన్ ఫ్లిక్ట్ వస్తుంది. ఈ కాన్ ఫ్లిక్ట్ నుంచి సంజూ తీసుకున్న నిర్ణయం దర్శకుడి తెలివికి నిదర్శనం. నిజానికి అంతకు ముందే ఇది హ్యాపీ ఎండింగ్ స్టోరీ అని తెలుస్తుంది. కానీ ఆ ఎండింగ్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి తగ్గకుండా చూసుకున్నాడు దర్శకుడు. దీనివల్ల ఎక్కడా బోర్ కొట్టకుండా అలా సాగిపోతుంది కథనం. ఫైనల్ గా ఓ సెంటిమెంట్ సీన్ తో హ్యాపీ ఎండింగ్ పడుతుందీ కథకు.

ఆర్టిస్టుల్లో ప్రకాష్ రాజ్ మరోసారి అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. రామ్ తన ఎనర్జీని కాస్త తగ్గించుకుని పాత్రకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. అనుపమ పాత్రకు పెద్దగా నటించే చాన్స్ లేదు. అయినా ఆకట్టుకుంటుంది. ఇక ఇతర పాత్రలన్నీ రెగ్యులర్ గా చూసినవే.. చూస్తున్నవే..
టెక్నికల్ గా దేవీ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. అతన్నుంచి ఎక్స్ పెక్ట్ చేసే అవుట్ పుట్ కాదిది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి.

ఫైనల్ గా పండగ శెలవుల్లో పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది హలోగురూ ప్రేమకోసమే. రామ్ కు చాలా రోజుల తర్వాత మంచి హిట్ పడ్డట్టే అనుకోవచ్చు. రామ్ కు మాత్రమే కాదు.. హీరోయిన్ తో పాటు ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా పండగను మరింత జోష్ గా చేసుకోవచ్చు.

ఫైనల్ గా : ఎంగేజింగ్ ఎంటర్టైనర్ గురూ ..

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.