8వ రోజు జగన్మాత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు

ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో 8వ రోజు జగన్మాత దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది. అలాగే దీక్ష విరమణ కోసం భవానీలు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు.

ఉత్సవాల్లో చివరిరోజు దుర్గమ్మ అర్ధరాత్రి 1గంట నుంచి గురువారం ఉదయం 11గంటల వరకు మహిషాసురమర్ధినిగానూ, ఆ తర్వాత మధ్యాహ్నం 1గంట నుంచి రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు.