శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో పరిసమాప్తం

Brahmotsavam 2018

తిరుమలలో దేవదేవుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన బుధవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. శిరస్త్రాణాన్ని ధరించిన గోవిందుడు ఖడ్గం చేతపట్టి యుద్ధవీరుని రీతిలో అశ్వవాహనంపై ఊరేగుతుంటే.. వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక సాగరంలో మునిగిపోయారు.

స్వామి భక్తులకు భౌతికమైన జ్ఞానేంద్రియాలను కట్టుదిట్టం చేసి దివ్యమైన జ్ఞానం ప్రసాదిస్తాడని అఖండకోటి భక్తుల నమ్మకం. శ్రీమహావిష్ణువు కలియుగాంతంలో కల్కి అవతారంలో విచ్చేస్తారు. ఈ అవతారంలో అశ్వవాహనరూఢుడై దుష్టజన సంహారం, శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నేటితో పరిసమాప్తం కానున్నాయి… చక్రస్నానం నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటలవరకు స్వామివారి ఉత్సవమూర్తులకు. చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.