ఎగిరే కారు వచ్చేసింది.. (వీడియో)

flying car Etisalat comming soon

హైదరాబాద్‌ నుంచి విజయవాడ కారు లేదా బస్‌లో వెళ్లాలంటే కనీసం ఆరు గంటలు పడుతుంది. అదే విమానం అయితే ఒక గంట సేపు.. కానీ అందరూ విమానం ఎక్కి పోవాలంటే కుదరదు కదా.. అదే ఎగిరే కారు అందుబాటులో ఉంటే. ఇంకెలావుంటుందో ఆలోచించుకోండి. కాలుష్యం బాధలుండవు.. ట్రాఫిక్‌జాం బాధ తప్పుతుంది. ఈ ఉపయోగాల్నిఅందిపుచ్చుకోవడానికే ఎగిరే కార్ల కాన్సెప్ట్‌ ముందుకొచ్చింది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఎగిరే కార్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దుబాయ్ లో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎగిరే కారును ఇప్పటికే తయారు చేసింది. అంతేగాదు దీన్ని ప్రయోగించి వీక్షకులు కూడా చూడండని సామజిక మాధ్యమాల్లో ఓ వీడియో షేర్ చేసింది. ఎటిసలాట్ కంపెనీని చెందిన ఫ్లైయింగ్ కారును దుబాయ్ గెటెక్స్ టెక్నాలజీ వీక్ లో ప్రదర్శించారు. అచ్చం విమానం లాగ ఎగురుతూ ఈ కారు ముందుకు సాగుతుంటే అందరూ చూసి ఆనందించారు. అతి త్వరలోనే ఎగిరే కారు అందుబాటులోకి వస్తుందని.. తద్వారా కుటుంబం మొత్తం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే నేలమీద కాకుండా గాల్లో వెళ్లొచ్చని అనుకుంటున్నారు.