జియో దీపావళి ఆఫర్‌ : ఏడాదంతా ఫ్రీ

reliancejio-diwali-offer-special-long-validity-prepaid-plan-547gb-data

రిలయన్స్ జియో దీపావళి పండగ ఆఫర్ ను ప్రకటించింది. ఏడాదికి సరిపడా భారీ ఆఫర్ ప్రకటించేసి ఇతర టెలికాం నెట్వర్క్ లకు సవాల్ గా మారింది. ఈ దివాళికి రూ.1699తో రీఛార్జ్‌ చేసుకుంటే వచ్చే ఏడాది దివాళి వరకు కస్టమర్లు ఉచితంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది. ఈ ప్లాన్‌ కింద ఉచితంగా లోకల్‌ మరియు ఎస్టీడీ కాల్స్, రోమింగ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా 1699 రూపాయల ప్లాన్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం కూడా కల్పిస్తోంది. అయితే ఇందుకోసం 2018 నవంబర్‌ 30 లోపు కస్టమర్లు ఈ స్కీమ్‌లోకి ఎంటర్‌ కావాల్సి ఉంటుంది. 100 శాతం క్యాష్ బ్యాక్ ను కూపన్ల రూపంలో ఇస్తుంది. రిలయన్స్‌ డిజిటల్‌ లేదా రిలయన్స్‌ డిజిటల్‌ ఎక్స్‌ప్రెస్‌ మిని స్టోర్లలో కనీసం రూ.5000 పైన కొనుగోలు చేస్తే వాడుకోవచ్చు. అయితే కస్టమర్లకు వచ్చిన ఈ ఓచర్లు 2018 డిసెంబర్‌ 31కు ఎక్స్‌పైరీ అయిపోతాయి కాబట్టి ఈలోపే వాటిని వాడుకోవాలని చెబుతోంది.