బీ రెడీ.. డీఎస్సీ నోటిఫికేషన్.. ఆన్‌లైన్‌లోనే పరీక్ష

ఏడాది కాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. అక్టోబరు 25,26 తేదీల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈసారి డీఎస్సీని ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. ఆన్‌లైన్ పరీక్ష కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే అయినప్పటకీ అదే ఉత్తమమని అధికారులు భావిస్తున్నారు. ఎస్జీటీలకు టెట్ కమ్ టీఆర్టీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీలకు డీఎస్సీ నిర్వహిస్తారు. కొత్తగా మంజూరైన పోస్టులకు ఆర్ధికశాఖ నుంచి ఇంకా అనుమతి రాలేదు. పురపాలిక, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖకు అందించాయి. ప్రస్తుతం జారీ చేసే డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 9వేల పోస్టుల వరకు భర్తీ చేయనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని 1,900 పోస్టుల్లో 800 మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీకి ఆ శాఖ ఆమోదం తెలిపింది. గురుకుల పాఠశాలల్లోని 1100 పోస్టులను ఆ శాఖే నేరుగా భర్తీ చేయనుంది. తమ పరిధిలోని 750 పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా పాఠశాల విద్యాశాఖకు అప్పగించేందుకు సాంఘీక సంక్షేమ శాక నిరాకరించింది. ఈ నేపథ్యంలో మిగిలిన 7,675 పోస్టుల వరకే నోటిఫికేషన్ జారీ చేసే
అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.