రూ.150 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతున్న ‘వీర రాఘవుడు’

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవిందసమేత వీరరాఘవ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్లు వచ్చాయి. మూడు రోజుల్లేనే రూ.100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం, 8 రోజుల్లో రూ.130 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

అరవింద సమేత వీరరాఘవ చిత్రం నిన్నటితో 10 రోజులు కంప్లీట్ చేసుకుంటోంది. ఈ పది రోజుల కలెక్షన్లు రూ.150 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఓవర్సీస్ లో 2 మిలియన్ క్లబ్ లో చేరింది ఈ సినిమా. ఆంద్రా, తెలంగాణ, సీడెడ్ తో పాటు కర్ణాటకలోనూ ఈ చిత్రానికి ఎన్టీఆర్ కెరీర్లో హైయ్యెస్ట్ కలెక్షన్లు వచ్చాయి.