ఒకరితో బ్రేకప్.. మరొకరితో టై అప్.. నవంబర్‌లో ముహూర్తం..

ప్రేమించిన వ్యక్తికి ప్రాణం ఇచ్చాను. జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. కానీ అతడు నా ప్రేమను సీరియస్‌గా తీసుకోలేదు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయాడు. ఈ సంఘటనతో అతడి మీద ప్రేమ పోయింది. అందుకే వివాహం చేసుకోవాలనే ఆలోచనను కూడా విరమించుకున్నాను అంటోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె.

రణ్‌‌బీర్ తనను నమ్మించి మోసం చేశాడు అందుకే అతడి ప్రేమకు బ్రేకప్ చెప్పానంటోంది. రణ్‌బీర్ నుంచి దూరమైన దీపిక మరోనటుడు రణ్‌వీర్‌కు దగ్గరైంది. 2013లో రామ్‌లీలా చిత్రంలో కలిసి పని చేస్తున్న సమయంలోనే వీరిద్దరిమధ్య ప్రేమ చిగురించింది. ఆ తరువాత బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాల్లో కలిసి నటించారు.

దాంతో వీరి బంధం మరింత బలపడింది. ప్రేమ విషయాన్ని తెలపకపోయినా సన్నిహితంగా మెలిగేవారు. వీరి ప్రేమాయణం గురించి వస్తున్న వార్తలకు తెరదించేందుకు ఈ జంట సిద్ధమైంది. తాము అతి త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. వచ్చేనెల నవంబరు 14,15 తేదీల్లో తమ వివాహ వేడుక జరగనున్నట్లు తెలిపారు.