
విశాఖను ఐటీ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటెక్ రంగ ప్రస్తుత స్థాయిని 1.0 నుంచి 2.0 శాతానికి తీసుకెళ్లే లక్ష్యంతో.. ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
విశాఖలో ఐటీని ఇంకాస్త విస్తరించేందుకు నేటి నుంచి ఐదు రోజుల పాటు వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2018 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం.. వైజాగ్ ఫిన్‌టెక్ వ్యాలీ సంయుక్తంగా నిర్వహించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్‌తో పాటు 15 దేశాలకు చెందిన రెండు వేల మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రపంచంలో 8 చోట్ల ఏపీ ప్రభుత్వం డాలర్ చాలెంజ్ కాంపిటేషన్‌ని నిర్వహించింది. ఇందులో మొదటి స్థానం పొందిన సంస్థలకు లక్షా 50 వేల డాలర్లు, రెండో స్థానం సాధించిన సంస్థలకు లక్ష డాలర్లు ఇవ్వనుంది..
మొదటి రోజైన సోమవారం ఉదయం గోల్ఫ్ టోర్నమెంట్‌తో ఫిన్‌టెక్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది.. రెండో రోజు నోవాటెల్‌లో జరిగే కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్‌లు పాల్గొంటారు. అదే రోజున రోబో సోఫియాతో సీఎం పదినిమిషాల పాటు మాట్లాడనున్నారు.. మూడో రోజున కాన్ఫరెన్స్‌తో పాటు ఎగ్జిబిషన్, నాలుగు రోజున అవార్డుల ప్రదానోత్సవం.. ఐదో రోజున ఫెస్టివల్‌కు వచ్చిన ప్రతినిధులు విశాఖను సందర్శించనున్నారు.