రేపు హీరో ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ అమ్మాయే?

guntur-girl-name-surfaces-prabhas-marriage

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది.. రెబల్ స్టార్ ప్రభాస్ పేరే.. పెదనాన్న నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని.. తనదైన శైలి నటనటంతో రాణిస్తున్నాడు. దేశం గర్వించదగిన సినిమా ‘బాహుబలి’లో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత తాను పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ వెల్లడించాడు. దాంతో పెళ్లి కూతురు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉందని కొన్ని రోజులు.. వైజాగ్ అమ్మాయని కొన్ని రోజులు ఇలా వార్తలు హల్చల్ చేశాయి. ఈ క్రమంలో ప్రభాస్ తన పుటిన రోజునాడు కీలక నిర్ణయం వెల్లడిస్తాడని.. గుంటూరుకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దాంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రభాస్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరయి ఉంటారు? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కూడా పెళ్ళికి ఓకే చెప్పడంతో ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆవిడ ప్రభాస్ బంధువల అమ్మాయే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇంతకీ రేపటి రోజు.. పుట్టిన రోజున జరుపుకుంటున్న ప్రభాస్ తన పెళ్లి విషయంపై ప్రకటన చేస్తాడా లేక మళ్ళీ నాన్చుతాడో వేచి చూడాలి.