విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం

paidithalli-ammavari-festival-in-vijayanagaram

ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ఉదయం 8 గంటల సమయంలో కేంద్ర మాజీ మంత్రి, ఆలయ ధర్మకర్త అశోక్‌ గజపతి రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు.

పైడితల్లి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తోలేళ్ల ఉత్సవం ఇవాళ రాత్రి 12 గంటల సమయంలో జరగనుంది. విజయనగరం జిల్లా నుంచే కాకుండా శ్రీకాకుళం, విశాఖ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయం భక్తజనసంద్రమైంది. పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రేపు సిరిమానోత్సవం జరుగుతుంది.

రేపు హీరో ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ అమ్మాయే?