నిరుద్యోగులకు శుభవార్త.. 61 వేల పారామిలటరీ పోస్టులు..

దేశంలోని ఆరు పారామిలిటరీ బలగాల్లో 61వేలకు పైగా పోస్టులను భర్తీ చేపట్టనున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో పాటు మరికొన్ని పరీక్షల ద్వారా భర్తీ చేస్తామని హోంశాఖ అధికారి తెలియజేసారు.
ఖాళీలు:
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్: 18,460
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ : 10,738
సశస్త్ర సీమా బల్ : 18,942
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ : 5,786
అస్సాం రైఫిల్ : 3,840
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ : 3,812

దేశం మొత్తం మీద దాదాపు 10 లక్షల మంది పారామిలటరీ దళాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ప్రధానమైన సీఆర్‌పీఎఫ్ సిబ్బంది దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు.

బీ రెడీ.. డీఎస్సీ నోటిఫికేషన్.. ఆన్‌లైన్‌లోనే పరీక్ష

అంతర్గత భద్రత అవసరమైన సందర్భాల్లో రాష్ట్ర పోలీసులతో కలిసి వీరు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో, ఈశాన్య ప్రాంతాల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందిస్తుంటారు.