సీఎం చంద్రబాబు 28వ సారి..

cm chandrababunaidu review on polavaram project

సీఎం చంద్రబాబు 28వ సారి పోలవరం ప్రాజెక్ట పనుల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. స్పిల్ వే, లోయర్ కాపర్ డ్యామ్‌ను పరిశీలించారు. అనంతరం ఎగువ కాపర్ డ్యామ్ పనులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని వీక్షించారు. అక్కడ నుంచి ప్రాజెక్టు కొండపై ఉన్న క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు.. పోలవరం నిర్మాణం పనులపై అధికారులతో సమీక్షించారు.

‘ఎన్టీఆర్’ వెనుక భరత్ రెడ్డి…

మా నాన్న అలాంటి వాడు కాదు .. అర్జున్‌కు ఐశ్వర్య మద్దతు

ఈనెల 24 నాటికి లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌంటింగ్‌ పనులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. డిసెంబర్‌ నుంచి గేట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభిస్తామన్నారు. రూ.9870కోట్లకు సంబంధించి కేంద్రానికి నివేదికలు ఇచ్చామని తెలిపారు. ఆ నిధుల్ని కేంద్రం విడుదల చేయాల్సి ఉందన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికి 60 శాతం పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

నదుల అనుసంధానం ద్వారా పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. కృష్ణా డెల్టాకు ఈ సీజన్‌లో 73 టీఎంసీల నీరు మళ్లించామని చెప్పారు. వచ్చే మే నాటికి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరందిస్తామన్నారు. నీటి భద్రత ప్రభుత్వ విధానమని, పట్టిసీమ రాకపోతే కృష్ణా డెల్టా ఎండిపోయేదన్నారు. తిత్లీ తుపాను సహాయ చర్యల్లో కొందరు ఇబ్బంది పెట్టారని, బాధితులకు అన్నిరకాల ఆర్థికసాయం సత్వరమే అందించామని బాబు చెప్పారు.

సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ప్రాజెక్టు పనులను పరుగు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు.. ఎన్ని అడ్డంకులెదురైనా ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.