నష్టాల మార్కెట్లో బెల్.. జోరుమీదున్న ఐటీడీ

వరుసగా రెండో రోజు ఊపందుకున్న అమ్మకాలతో మార్కెట్లు నష్టాలతో డీలాపడ్డాయి. అయితే సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనల కారణంగా విద్యుత్‌ రంగ ప్రభుత్వ దిగ్గజం బీహెచ్‌ఈఎల్‌ కౌంటర్‌ ఓవైపు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటుంటే.. మరోపక్క పలు కాంట్రాక్టులు పొందిన వార్తలతో ఐటీడీ సిమెంటేషన్‌ కౌంటర్ సైతం లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం…

బీహెచ్‌ఈఎల్‌ లిమిటెడ్‌
ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను పరిశీలించేందుకు బోర్డు ఈ నెల 25న సమావేశంకానున్నట్లు బీహెచ్‌ఈఎల్‌(భెల్‌) తాజాగా వెల్లడించింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో భెల్‌ షేరు 2.3 శాతం పెరిగి రూ. 76 సమీపంలో కదులుతోంది.

దీపావళికి గోల్డ్ రేట్లు భారీగా..

ఐటీడీ సిమెంటేషన్‌
తాజాగా మొత్తం రూ. 1066 కోట్ల విలువైన కాంట్రాక్టులను పొందినట్లు ఐటీడీ సిమెంటేషన్‌ తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్‌ వెలుగులొకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం పుంజుకుని రూ. 113 వద్ద ట్రేడవుతోంది. కాంట్రాక్టుల జాబితాలో పుణే ఎయిర్‌పోర్ట్స్‌ అధారిటీ నుంచి లభించిన సమీకృత ప్రయాణికుల టెర్మినల్‌(బిల్డింగ్‌) నిర్మాణంతోపాటు..  తిరువనంతపురంలోని విజింజామ్‌ పోర్ట్‌(అదానీ)లో బ్రేక్‌వాటర్‌ నిర్మాణం, విశాఖ పోర్ట్‌ట్రస్ట్‌లో బెర్తుల మెరుగు తదితరాలున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీలో ప్రమోటర్లకు ప్రస్తుతం 46.64 శాతం వాటా ఉంది.