శబరిమల ఆలయ ద్వారాలు మూసివేసిన అర్చకులు

శబరిమలలో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. మాసపూజల అనంతరం సోమవారం రాత్రి పది గంటలకు శబరిమల ఆలయ ద్వారాలు మూసివేశారు. మళ్లీ నవంబర్ 3వ వారంలో మండలపూజల కోసం ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. గత నాలుగు రోజులుగా శబరిమలలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ ఉవ్వెత్తున లేస్తున్న నిరసనలకు కాస్త బ్రేక్‌ పడినట్టయ్యింది.

శబరిమల, పంబ ప్రాంతాల నుంచి మీడియా వెళ్లిపోవాలని, భక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి నిరసనగా శివసేన, ఇతర హిందూ సంఘాలు మహార్యాలీ నిర్వహించాయి. అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం శబరిమల, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించింది…

ప్లకార్డుతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన చిన్నారి.. ఏం రాసి ఉందంటే..

సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి 12 మంది మహిళలు చేసిన భగీరథ ప్రయత్నాలు విఫలమయ్యాయి. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల ఒక్క మహిళకూ ఈ ఐదు రోజుల్లో దర్శనం దక్కలేదు. భక్తులు అడ్డుకోవడంతో చేసేదేమీ లేక శబరిమలకు వెళ్లిన మహిళలు వెనుదిరిగారు. మరోవైపు ఏపీలోని గుంటూరుకు చెందిన వాసంతి, ఆదిశేషి అనే ఇద్దరు మహిళలు శబరిమల దర్శనానికి వెళ్లడానికి యత్నించడంతో పంబ వద్ద భక్తులు అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు వెనక్కు పంపించేశారు.