బీజేపీ-టీడీపీ నేతల మధ్య అగ్రిగోల్డ్‌ చిచ్చు

tdp-and-bjp-leaders-fire-on-aggrigold

ఏపీలో బీజేపీ-టీడీపీ నేతలకు మధ్య అగ్రిగోల్డ్‌ చిచ్చు రాజేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపిచ్చింది. విజయవాడలో బాధితులకు మద్దతుగా బీజేపీ ధర్మ పోరాట దీక్షను చేపట్టింది. ఇందులో టీడీపీ నేతలపై బీజేపీ నేతలు ఘాటైన విమర్శలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు చేశారు. 3 వేల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను 270కోట్లకు కాజేయాలని చూశారని కన్నా ఆరోపించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో టీడీపీ నేతలు కుమ్మక్కైన కారణంగా.. న్యాయం జరక్క 3 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారన్నారు.

మా నాన్న అలాంటి వాడు కాదు .. అర్జున్‌కు ఐశ్వర్య మద్దతు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొట్టేయాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ఆరోపించారు. ఏపీలో త్వరలోనే ప్రభుత్వం మారుతుందని, కొత్త ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే బీజేపీ…. బాధితులకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అటు.. టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఆరోపించారు.

అటు.. కమలనాథుల విమర్శలపై మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మి అందరికీ న్యాయం చేసేందుకు చంద్రబాబు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. దొంగే తిరిగి దొంగ అన్న చందంగా బీజేపీ నేతలు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు భావిస్తే.. కేంద్రం నుంచి బెయిల్ ఔట్ ప్యాకేజీ ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేసారు..

మరోవైపు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఎంపీ కేసినేని నాని బీజేపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు అగ్రిగోల్డ్ డిపాజిట్ల సేకరణ జరిగింది 2004- 2014 మధ్య అని.. అప్పుడు సహకార మంత్రిగా ఉన్నది కన్నా లక్ష్మీనారాయణేనని గుర్తు చేశారు..

అటు.. అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంపై వైఎస్‌ జగన్..చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నాలుగన్నర సంవత్సరాలైనా ఇప్పటి వరకు బాధితులకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. మొత్తానికి అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో బీజేపీ-టీడీపీ-వైసీపీ నేతల విమర్శలు.. ప్రతి విమర్శలతో ఏపీలో రాజకీయం వేడెక్కింది.