ఏకధాటిగా వారం రోజులు సెల్‌ఫోన్ వాడింది.. తర్వాత!

నేటి ఆధునిక ప్రపంచంలో టేక్నాలజీ విస్తరిస్తోంది. పెరుగుతున్న సాంకేతిక ప్రపంచంలో యువత మునిగి తేలుతోంది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కల్చర్ పెరిగిపోతున్న కొద్ది యువత వాటికే అతుక్కుపోతుంది. తినేటప్పుడు,నడుస్తున్న సమయంలో కాస్త ఖాళీ దొరికినా స్మార్ట్‌ఫోన్లకే సమయం కేటాయిస్తున్నారు. గంటలకు గంటలుగా ఫోన్‌లో గడిపేస్తున్నారు. ఇలాగే చైనాకు చెందినా ఓ యువతి ఏకంగా వారం రోజులు ఏకధాటిగా ఫోన్‌ను వాడింది. ఎంతలా అంటే ఫోన్ కోసం వారం రోజుల పాటు ఆఫిస్‌కుసెలవు పేట్టింది. రాత్రి పూట నిద్రిస్తున్న కొద్ది సమయం తప్ప రోజు మెుత్తం ఫోన్‌తోనే గడిపింది. చివరకు ఆమె రెండు చేతి వేళ్లు అలాగే బిగుసుకపోయాయి . వేళ్లు మొబైల్‌ను పట్టుకొనే పొజిషన్‌లో కదలకుండా అలాగే ఉండిపోయాయి.

చివరకు ఆ మహిళ డాక్టర్ దగ్గరకు చికిత్స కోసం వెళ్లింది. ఆమెకు చికిత్స చేసిన వైద్యులు ఎలాగోలా చేతి వేళ్లను మళ్లీ సాధారణ స్థితికి తీసుకు రాగలిగారు. అదే పనిగా చేతి వేళ్ళతో మొబైల్ ను ఉపయోగించడంతో వాటి చుట్టూ ఫ్లుయిడ్ నిండినట్లు డాక్టర్లు గుర్తించారు. ఇలాంటి పరిస్థితిని టెనోసినివిటిస్‌గా వైద్యులు పేర్కొన్నారు.తిరిగి ఇలాంటి పని చేయవద్దంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు.