కాబోయే భార్య కోసం ఖరీదైన విల్లా..

తనకంటే పదేళ్లు చిన్నవాడైనా ప్రాణంగా ప్రేమించే ప్రియుడు దొరికాడు. పెళ్లితో జీవిత భాగస్వామి అవుతున్నాడు. వచ్చే నెలలో వివాహం చేసుకోబోతున్న బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమైద్ భవన్‌లో వివాహం చేసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

డిసెంబర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. మరి తను ప్రేమించిన ప్రియురాలే భార్య అవుతోంది. ఆమెకు ఓ అందమైన కానుకను బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు.

మరి ఆమె పట్ల తనకున్న ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి ఓ విల్లాను బహుమతిగా ఇస్తున్నాడు నిక్ జోనాస్. లాస్ ఏంజెల్స్‌లోని బెవర్లీ హిల్స్ ప్రాంగణంలో నిక్ జోనాస్‌ 6.5 మిలియన్ డాలర్ల(సుమారు 48 కోట్లు) తో ఓ విల్లాను కొన్నాడు.

ఒకరితో బ్రేకప్.. మరొకరితో టై అప్.. నవంబర్‌లో ముహూర్తం..

ఈ రాజభవనంలో స్విమ్మింగ్ పూల్, ఐదు పడకగదులు, అతిథి వింగ్ నాలుగు బాత్‌రూములు ఉన్నాయి. ఈ విల్లాలో స్పెషల్ అట్రాక్షన్ గాజుతో తయారు చేసిన గోడలు విల్లా అందాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి.

ఇంతకీ నిక్ ఇక్కడ విల్లాను నిర్మించడానికి కారణం ప్రియాంకకు ప్రపోజ్ చేసింది ఇక్కడేనట.