ఆలయం నుండి కోట బురుజు వరకు మూడుసార్లు సిరిమాను

vijayanagaram paidithalli ammavari festival

భక్తుల జయజయ ధ్వానాల మధ్య అమ్మవారి సిరిమాను సంబరం ముగిసింది. సాయింత్రం 4 గంటలకు అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన సిరిమాను సంబరం సాయంత్రం 5.45 నిముషాలకు ముగిసింది. సిరిమాను రథం ముందు అంజలి రథం, పాల ధార, జాలరి వల రథాలు కదులుతుంటే వెనుక సిరిమాను మూడు రౌండ్లు తిరిగింది. వీటిని అనుసరిస్తూ సిరిమాను ముందుకు కదిలింది. అమ్మవారి ఆలయం నుండి కోట బురుజు వరకు మూడుసార్లు సిరిమాను తిరిగింది. ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు మొదటిసారి సిరిమానును అధిరోహించారు. కోట బురుజుపై ఆశీనులైన పూసపాటి విజయనగర రాజ వంశీకులను అమ్మవారు సిరిమాను రూపంలో ఆశీర్వదించింది.

నా పెళ్లి.. ఎవరికీ చెప్పకండి ప్లీజ్.. : కమెడియన్

సిరిమాను ఘట్టాన్ని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి సుజయక్ళష్ణ రంగారావు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ హరిజవహర్ లాల్, ఇతర నాయకులు, అధికారులు సిరిమాను ఉత్సవాన్ని బురుజు కోట నుండి తిలకించారు. పూజారిని అరటిపళ్లతో కొడుతూ సిరిమానును తిలకించడానికి వచ్చిన భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. పూజారికి అరటిపళ్లు తగిలితే అమ్మవారికి తమ మొక్కులు తీరినట్టేనని భక్తులు భావిస్తారు. మొత్తంగా సిరిమాను ఉత్సవం నేత్ర పర్వంగా సాగింది.

ఉత్సవం సందర్భంగా పైడితల్లి అమ్మవారిని సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లుగా ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ ఉత్సవ వేళలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఆ నమ్మకానికి తగినట్లుగానే వేలాది మంది భక్తులు అర్ధరాత్రి సైతం క్యూలో నిల్చొని అమ్మవారిని దర్శించు కున్నారు. మొక్కులు మొక్కుకున్న వారు ఘటాలతో వచ్చి అమ్మవారికి సమర్పించుకున్నారు.

రాజ వంశీయులైన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తమ కుటుంబ సభ్యులతో సహా తెల్లవారుజామునే అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయక్ళష్ణ రంగారావు అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో సహా అమ్మవారిని దర్శించుకున్నారు.

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు సుమారు మూడు లక్షల మంది విజయనగరం తరలివచ్చారు. దీంతో విజయనగరం పురవీధులన్నీ జనసంద్రంగా మారాయి. భక్తుల తాకిడిని అంచనా వేసిన జిల్లా అధికారులు.. సుమారు 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. దీంతో భారీగా భక్తులు హాజరైనా.. ప్రశాంతంగా అమ్మవారి ఉత్సవం ముగిసింది.