రైస్ ప్యాకెట్‌లో ఎలుక.. కస్టమర్ షాక్

వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ప్రకటనలతో అదరగోట్టే సూపర్ మార్కెట్స్ సేప్టీ విషయంలో ఏమాత్రం శ్రద్ద వహించడం లేదు. తాజాగా జర్మీనిలోని లీడ్లి సూపర్ మార్కెట్స్‌లో రిచర్డ్ అనే కస్టమర్స్ అన్నం ప్యాకేట్‌ కొనుగొలు చేశారు. దానిని ఇంటి తీసికోచ్చి ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ గురయ్యారు. రైస్ ప్యాకేట్‌లో చనిపోయిన ఎలుక కనిపించడంతో రిచర్డ్ ఎలుకను ఫోటో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘నేను కొన్న అన్నం ప్యాకెట్‌లోకి ఎలుక ఎలా వచ్చింది. దాని వాళ్ళ మా ఇంట్లో దుర్వాసన వస్తోంది. నా భార్య వాంతులు చేసుకుంటోంది’ అనే కాప్షన్‌ను జతచేశాడు. ఇది కాస్తా నెట్టింట్లో బాగా వైరల్ మారింది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ జరగాయి.దీంతో బెంబేలెత్తిన సదురు కంపెని తమ సిబ్బందిని రిచర్డ్ ఇంటికి పంపిచింది. దాన్ని పరీక్షించిన వారు అది ఎలుక పిల్ల కాదని.. నిల్వ ఉండటం వల్ల బూజు పట్టిందని నిర్థారించారు. వెంటనే సదరు సంస్థ క్షమాపణలు చెప్పింది. దీనిపై పూర్తి విచారణ జరుపుతామని సదరు సంస్థ మీడియాకు తెలిపింది.