
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు వెస్టిండీస్ క్రికెటర్ డ్వాన్ బ్రావో. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బ్రావో రిటైర్మెంట్ నోట్లో పేర్కొన్నారు. 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేతో బ్రావో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చారు. మూడు నెలల అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో తన టెస్ట్ మ్యాచ్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. మొత్తం 270 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన బ్రావో అందులో 40 టెస్ట్ మ్యాచ్‌లు, 164 వన్డే మ్యాచ్‌లు, 66 టీ 20 మ్యాచ్‌లు ఆడడం విశేషం. 2016 సెప్టెంబర్‌లో విండీస్ తరపున బ్రావో చివరిసారిగా ఆడాడు.
Also Read: రికార్డుల రారాజు సచిన్‌ని అధిగమించే ఆటగాడు అంటే..
అప్పటినుంచే బ్రావో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లుగా ప్రచారం జరిగినా తాజా వార్తతో అది నిజమైంది. ఇండియాలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై జట్టు తరపున బ్రావో ఆడాడు. ఆల్‌రౌండర్‌గా పేరున్న బ్రావో వన్డే మ్యాచుల్లో 2,968 పరుగులు చేసి 199 వికెట్లు తీశాడు.