7,729 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 7,729 టీచర్ పోస్టులను జిల్లా సెలెక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష రాసే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని రెండు సంవత్సరాలు పెంచారు. ఓసీ అభ్యర్థులకు 42 నుంచి 44 సంవత్సరాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47
నుంచి 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు 52 నుంచి 54 సవంత్సరాలకు పెంచారు.
డీఎస్సీ షెడ్యూల్
నవంబరు 1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
డిసెంబరు 6, 10 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్స్ (నాన్ లాంగ్వేజెస్) రాత పరీక్షలు
11న స్కూల్ అసిస్టెంట్స్ (లాంగ్వేజెస్) రాత పరీక్షలు
12,13 తేదీల్లో పీజీ టీచర్స్ రాత పరీక్ష
14,26 తేదీల్లో టీజీ టీచర్స్, ప్రిన్సిపల్స్ రాత పరీక్ష
17న పీఈటీ, మ్యూజిక్, క్రాప్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ రాత పరీక్షలు
27న లాంగ్వేజ్ పండిట్స్ రాత పరీక్ష
28నుంచి 2019 జనవరి 2 వరకు ఎస్‌జీటీ రాత పరీక్ష

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, గుడివాడ, నంద్యాల మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 10, 241 లాంగ్వేజ్‌పండిట్, 2608 పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ తెలిపారు. గతంలో పెండింగ్‌లో ఉన్న 30 శాతం పీఈటీ (360), పండిట్(437) పోస్టుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉందని రామకృష్ణ తెలిపారు.

Read Also:పదవతరగతి అర్హతతో ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..