ఆమె నాపై అత్యాచారం చేసింది : రాఖీ సావంత్

bollywood-meetoo-twist

బాలీవుడ్‌లో కాక రేపుతున్న మీటూ వివాదంలో రోజుకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటోంది. మీటూ విజిల్‌ బ్లోయర్‌ తనుశ్రీ దత్తాపై ఇప్పటికే అనేక ఆరోపణలు చేసిన ఐటమ్‌ గాళ్‌ రాఖీ సావంత్‌.. తాజాగా మరో బాంబ్‌ పేల్చింది. తనుశ్రీ తనపై చాలా సార్లు అత్యాచారం చేసిందంటూ చెప్పింది. అంతేకాదు.. ఓ అమ్మాయిని మరో అమ్మాయి రేప్‌ చేయడమేంటని అనుకోవద్దని…. 377 చట్టాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలని సూచించింది. ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నానని చెప్పిన రాఖీ… ఇకపై షీటూ ఉద్యమం కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పింది.

Also Read : అలోక్‌ వర్మ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ

తనూశ్రీ దత్తా పైకి చూడ్డానికి మాత్రమే అమ్మాయని.. లోపల అన్నీ మగ బుద్ధులేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను డ్రగ్స్‌ తీసుకోమని బలవంతపెట్టేదని… రేవ్‌ పార్టీలో పొగాకును మద్యంలో కలుపుకొని తాగడం తనూకు అలవాటుందని చెప్పింది. తనూశ్రీ ఓ లెస్బియన్‌ అని చెప్పిన రాఖీ…. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చాలా మంది లెస్బియన్స్‌ ఉన్నారని వాళ్ల పేర్లు బయటపెట్టబోనంది. నార్కో టెస్ట్‌ నానా పటేకర్‌కి కాక తనూకి చేయాలని డిమాండ్‌ చేసింది.