కెనరా బ్యాంక్‌లో 800 ఉద్యోగాలు..

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రముఖమైన కెనరా బ్యాంక్ 800 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్- బెంగళూరు లేదా ఎన్‌ఐటీటీఈ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్- గ్రేటర్ నోయిడాల్లో ఏదో ఒక చోట ఏడాది పాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్స్ చదవాలి. కోర్సు పూర్తయిన తరువాత ప్రొబెషనరీ ఆఫీసర్ (జేఎంజీఎస్-1) హోదాతో కెనరా బ్యాంక్‌లోకి తీసుకుంటారు.
మొత్తం ఖాళీలు: 800
అర్హత: 60% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత( ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55% మార్కులు సరిపోతాయి)
వయసు: అక్టోబర్ 1,2018 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)
ఎంపిక: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేదీ : నవంబర్ 13, 2018.

7,729 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్..
పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
పూర్తి వివరాలకు:

వెబ్‌సైట్ www.canarabank.com